తన అరెస్టు విషయంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు

by సూర్య | Sun, May 30, 2021, 01:11 PM

వైఎస్సార్‌ సీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన గచ్చిబౌలి స్టేషన్‌ ఆఫీసర్‌ పాటించలేదని ఆరోపిస్తూ రఘురామ కృష్ణం రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ అధికారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురామరాజు లేఖలో కోరారు. గతంలో పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ మార్గదర్శకాలను వివరిస్తూ లేఖలో ప్రస్తావించారు. కాగా ఈనెల 14న తన అరెస్టు సమయంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసీఆర్ కు 8 పేజీల లేఖ రాశారు. 

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM