ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు ?

by సూర్య | Sat, May 29, 2021, 02:24 PM

అంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం కర్ఫ్యూను విధిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు అధికారులు. అయితే పీలో కర్ఫ్యూను మరోసారి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంకొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ కొనసాగింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోవిడ్ తీవ్రంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. తూర్పుగోదావరి, చిత్తూరులో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని తెలుస్తోంది.


రాష్ట్రంలో కేసులు తగ్గాలంటే 4 వారాలు కర్ఫ్యూ ఉండాలని ఇటీవలే సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టి 10 రోజులే అయ్యిందని.. పరిస్థితి అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. గ్రామాల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. గడిచిన వారం రోజులుగా 15 వేల పై చిలుకు కేసులు నమోదు అవుతునున్నాయి. అదే సమయంలో ప్రతి రోజ వందకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాల్లో జూన్ 30 వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్రం కూడా సూచించింది. అయితే, లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కర్ఫ్యూను మరి కొన్ని రోజులు పొడింగిచే ఛాన్స్ ఉంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM