ఆనందయ్య మందును సప్లిమెంటరీ మెడిసిన్‌గా అందిస్తాం : మంత్రి జి. కిషన్‌రెడ్డి

by సూర్య | Sat, May 29, 2021, 11:22 AM

ప్రజలకు మేలు జరుగుతుందని నిర్ధారణ అయితే, ఆనందయ్య మందును సప్లిమెంటరీ మెడిసిన్‌గా గుర్తిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. అయితే, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్‌ శాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఆనందయ్య మందును కొవిడ్‌ నివారణ మెడిసిన్‌గా గుర్తించలేమని స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమన్నారు. ప్రధాని మోదీ పీఎంకేర్స్‌ నిధి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ప్లాంట్లను మంజూరు చేశారని వెల్లడించారు. తెలంగాణలో 19, ఏపీలో 23 ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభమయ్యిందని, మిగతా ఆస్పత్రుల్లో జూన్‌ 30లోపు సిద్ధమవుతాయని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM