'అనంత లో ఆశ్చర్యం కలిగించే వింత ఆచారం'.. ఈ ఆచారానికి పోటీ ఎక్కువ

by సూర్య | Fri, May 28, 2021, 03:33 PM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివాహాల విషయంలో ఎన్నో నమ్మకాలు..ఆచారాలు..సంప్రదాయాలను పాటిస్తుంటారు. వీటిలో కొన్ని వింతగా ఉంటే..మరికొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. కానీ కొన్ని నమ్మకాలు మూఢంగా ఉంటాయి. వాటినే మూఢనమ్మకాలు అంటాం. వింత వివాహాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగుతుంటాయి. అటువంటిదే 'దేవుడితో పెళ్లి'. అదికూడా బాలికలకు దేవుడితో పెళ్లి చేయటం ఆచారం అంటారు అక్కడి వారు. సాధారణంగా దేవుడితో పెళ్లి చేయటం దేవదాసీ వ్యవస్థలో ఉంటుంది. దాన్నే జోగిని వ్యవస్థ అని కూడా అంటారు. కానీ ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగే ఈ దేవుడితో పెళ్లి అటువంటిది కాదు.


అనంతపురం జిల్లా పరిధిలోని రాయదుర్గంలో ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారికి వివాహం జరిపించారు. రాయదుర్గంలో గల శ్రీ పసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇది మా ఆచారంగా వస్తోందని అందుకే దాన్ని మేం అపేయకుండా కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు స్థానికులు. ఈక్రమంలో ప్రతీ సంవత్సరం అరవ వంశానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారికి వివాహం జరిపిస్తుంటారు. శ్రీవారితో తమ కుటుంబంలోని బాలికను ఇచ్చి వివాహం జరిపించేందుకు అరవ వంశస్థులు పోటీ పడుతుంటారు. అదో భాగ్యంగా భావిస్తుంటారు. ఈక్రమంలో ప్రతీ సంవత్సరం జరిగే ఈ వింత వివాహం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించే వారు. కానీ ఇది కరోనా సమయంలో కదా..అందుకని గురువారం (మే 27,2021) వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిరాడాంబరంగా ఈ వింత కళ్యాణం నిర్వహించారు స్థానికులు. ఇలా వడ్డికాసుల వాడితో చిన్ననాటే వివాహం జరిపిస్తే పెద్ద అయ్యాక ఆ బాలికకు శ్రీమంతుడు భర్తగా వస్తాడని స్థానికుల నమ్మకం అనే అంటుంటారు.

Latest News

 
అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు వస్తున్నాయి Thu, Apr 18, 2024, 01:09 PM
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ Thu, Apr 18, 2024, 01:08 PM
నేడు నామినేషన దాఖలు చేయనున్న సుజనా చౌదరి Thu, Apr 18, 2024, 01:08 PM
టిప్పర్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తికి గాయాలు Thu, Apr 18, 2024, 01:01 PM
కేశినేని శివనాథ్ ను కలిసిన ఇంటలెక్చువల్ ఫారం కమిటీ సభ్యులు Thu, Apr 18, 2024, 12:13 PM