సబ్‌స్టేషన్‌లో షార్ట్‌సర్క్యూట్‌.. భారీగా ఆస్తి నష్టం

by సూర్య | Thu, May 27, 2021, 10:58 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM