శ్రీశ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్న యాస్​ తుపాన్.. హై అలర్ట్ ప్రకటన

by సూర్య | Wed, May 26, 2021, 12:32 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ " IMD " ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని ధర్మాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర ధమ్రా – దక్షిణ బాలసోర్ " ఒడిశా " మధ్య ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక యాస్ తుఫాన్ ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 


ఇక ఏపీలో కూడా యాస్ తుఫాన్ ప్రభావం కనిపించనుంది. దుగరాజపట్నం  " నెల్లూరు " నుంచి బారువ " శ్రీకాకుళం " వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు. సముద్రంలో అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో ఎగసి పడుతాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM