ఆనందయ్య మందుపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు.. నేడు విచారించే అవకాశం

by సూర్య | Tue, May 25, 2021, 11:36 AM

నెల్లూరు ఆనందయ్య మందుపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా రోగులకు ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు పిటిషనర్లు. పిటిషనర్ల తరపున, న్యాయవాది బాలజీ, న్యాయవాది మల్లికార్జునరావు రెండు పిటిషన్లు విడివిడిగా దాఖలు చేశారు. ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి, శాంతి భద్రతల సమస్య రాకుండా చూడాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణి నిలిపివేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. లోకాయుక్తకు మందు నిలుపుదల చేసే అధికారం లేదని అందులో పేర్కొన్నారు న్యాయవాదులు. ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా ఆనందయ్య మందు నిలుపుదల చేయడంతో కరోనా రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని.. హై కోర్టు తక్షణమే ఆనందయ్య మందు పంపిణి జరిగేలా చూడాలని న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు ఇవాళ హై కోర్టు స్వీకరించి విచారించే అవకాశం ఉంది. 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM