రూపాయి ఇచ్చి పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయురాలు..

by సూర్య | Sat, Apr 10, 2021, 02:52 PM

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న జె.పద్మావతి. ప్రస్తుతం అవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మావతిని అందరూ 'రూపాయి టీచర్‌' అని ముద్దుగా పిలుస్తారు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి.. బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటం గమనించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లల పేరు మీద రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్డీ) అకౌంట్‌ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు. పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. 

Latest News

 
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM
సీఎం జగన్‌పై దాడి కేసు.. రాయి విసిరిన యువకుడి గుర్తింపు Tue, Apr 16, 2024, 08:08 PM
కర్నూలు ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్.. పూర్తి ఫ్రీగా. Tue, Apr 16, 2024, 07:36 PM
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ చల్లని కబురు Tue, Apr 16, 2024, 07:31 PM