టెన్త్ పరీక్షలపై కీలక నిర్ణయం

by సూర్య | Sat, Apr 10, 2021, 12:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ పదో తరగతి పరీక్షలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా పదో తరగతి విద్యార్థులకు శుభవార్తే. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన ప్రభుత్వం తాజాగా పరీక్షలపై సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. మొదటి, ద్వితీయ, తృతీయ భాష పరీక్షలకు సమయాన్ని పొడిగించారు. గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. గణితం, సామాజిక శాస్త్రానికి 3 గంటల 15 నిమిషాల సమయం కల్పించారు. అలాగే. భౌతికశాస్త్రం, జీవశాస్త్రానికి 2 గంటల 15 నిమిషాలు పెంచారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కు ఒక గంట 45 నిమిషాలు పెంచారు. ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం పెంచారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM