by సూర్య | Sat, Apr 10, 2021, 11:29 AM
చింత పులుపు లేకుంటే వంటలకు రుచి రాదు. అందుకే పులిహోర, పప్పు, పచ్చళ్ల వరకు చింత పండు లేకుంటే కుదరదు. అందుకే వంటింట్లో చింతపండు ఖచ్చితంగా ఉండాల్సిందే. పేరు చెబితే నోరూరే చింత పండు కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. చింత పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..
*రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
*అరుగుదలకు మంచిది
*బరువు తగ్గిస్తుంది
*రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది
*కీళ్ల సమస్యను తగ్గిస్తుంది
*కంటి చూపుకు మంచిది