ఈ పథకం కింద ల్యాప్ టాప్ పొందండిలా

by సూర్య | Wed, Apr 07, 2021, 05:22 PM

9 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ లను అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా విద్యార్థులు ఆప్షన్ ఎంపిక చేసుకునో ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశంతో కూడిన అంగీకార పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రింట్ తీసుకొని వాటిని ఏప్రిల్ 15నాటికి అన్ని పాఠాశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు అందించాలి. ఏప్రిల్ 19వ తేదీన 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి లేఖలను ఇస్తారు. ఆ లేఖలను విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లి తల్లి లేదా సంరక్షకునో సంతకం చేయించి డబ్బులు కావాలా..? ల్యాప్ టాప్ కావాలా..? అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏప్రిల్ 22నాటికి పాఠశాలలో అందించాలి. ఈనెల 26వ తేదీ నాటికి తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్న ఆప్షన్ కు సంబంధించిన వివరాలను అమ్మఒడి వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. వెబ్ సైట్లో వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ల్యాప్ టాప్ లు అవసరమో లెక్కించి.. ప్రముఖ కంపెనీలకు ఆర్డర్ ఇస్తుంది. ఈ పథకం ద్వారా రూ.27000 విలువ చేసే బ్రాండెడ్ ల్యాప్ టాప్ ను కేవలం రూ.18,500కే అందిస్తోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM