బీసీల సంక్షేమ ప్రధాత వైఎస్ జగన్: ఎమ్మెల్యే

by సూర్య | Wed, Apr 07, 2021, 04:07 PM

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం అని పెనమలూరు ఎమ్మెల్యే జులుసు పార్ధసారధి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2, 12, 40, 810 కోట్ల మంది వెనుకబడిన తరగతుల వారికి 22, 685. 74 బోట్ల రూపాయలు నగదు బదిలీ ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు.


గత ప్రభుత్వ హయాంలో కేవలం 69 కార్పొరేషన్లు ఉంటే ప్రస్తుతం బీసీల అభ్యున్నతి కోసం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు బీసీలలో నైపుణ్యాన్ని పెంచడానికి ప్రతి కార్పొరేషన్లోనూ స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధిని నియమించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం దేవాలయాలు, మార్కెటింగ్ కమిటీలు వంటి వివిధ నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి సముచిత ప్రాధాన్యతను ఇచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగనన్నకే దక్కిందన్నారు.


నియోజకవర్గంలో బీసీలు అధిక శాతం ఉన్నందువల్ల ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక వల్ల భవిష్యత్తులో బీసీ వర్గాలు ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి తధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రజకులు, నాయి బ్రాహ్మణులు, చేనేత కార్మికులు, టైలర్స్, ఆటో కార్మికులు వంటి అనగారిన వర్గాల అందరికీ పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు.


దీంతో పాటు ప్రస్తుతం వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకంలో వయసు 45 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM