కోవిడ్ వ్యాక్సిన్ పై భిన్నాభిప్రాయాలు!

by సూర్య | Wed, Apr 07, 2021, 01:36 PM

కోవిడ్ వ్యాక్సిన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవటం కారణంగా ఎక్కడో ఒకరు చనిపోయారన్న వార్తలు దావానంలా వ్యాపించి.. నూటికి తొంభై శాతం మంది వ్యాక్సిన్ వేయించు కునేందుకు విముఖత చూపిస్తున్నారన్నది నగ్న సత్యం. మన శరీరం నిర్మాణం, హెల్త్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుందన్న సంగతి వారికి వివరించ గలిగితే.. ప్రతి ఒక్కరినీ వ్యాక్సిన్ వేయించుక ఎనేందుకు ముందుకు వస్తారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధి నిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. ఇది సాధారణ జీవక్రియ. ఒకవేళ అలా జరగని పక్షంలో లేదా యాంటీ బాడీస్ తక్కువగా ఉన్న సందర్భంలో మనకి ఆ వైరస్ వలన కలిగే వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ వ్యాధిని నిరోధించటానికి శరీరంలోని శక్తి సరిపోలేదు కాబట్టి యాంటీ వైరల్ డ్రగ్స్ వాడాల్సి వస్తోంది.


వ్యాక్సిన్ మందు కాదు: ఏదైనా వ్యాధి వచ్చిందీ అంటే, మనకి యాంటీ బాడీస్ అసలు లేవనీ లేదా తక్కువ ఉన్నాయని కాదు. కరోనా ఉన్న వ్యక్తి ఒకేసారి మొఖం మీద గట్టిగా తుమ్మినపుడు తద్వారా ఒకేసారి లక్షలేదా 4 లక్షల వైరస్లు ఒంట్లోకి ప్రవేశిస్తే యాంటీ బాడీస్ సరిపోక కూడా వ్యాధి రావచ్చు. ఆ తర్వాత కొన్ని రోజు లకి అదే తగ్గిపోవచ్చు లేదా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి రావొచ్చు. ఇక వ్యాక్సిన్ విషయానికొస్తే వ్యాక్సిన్ అంటే మందు కాదనే చెప్తున్నారు.


వ్యాక్సిన్ ని 5-8 రకాలుగా తయారు చేస్తారు. నిజమైన వైరస్ ని తీసుకొని దాన్ని ఫార్మాలి హైడ్ లాంటి రసాయనాలతో చంపేసి ఆ మృత వైరస్ ని శరీరంలోకి ప్రవేశపెట్టినపుడు నిజమైన వైరస్ వచ్చింది అనుకొని శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. కొన్నిసార్లు సింగిల్ వైరస్ ని, మరి కొన్నిసార్లు కీడు చేసే జీన్స్న తొలగించి, బతికున్న వైరస్ నే వ్యాక్సిన్‌గా ఇస్తారు. ఇంకొన్నిసార్లు హానికరమైన వైరస్ జీన్స్ స్థానంలో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి మిగతాది అంతా వైరస్ జీన్సే ఉంచి, రీ కాంబినెంట్ టెక్నాలజీ ద్వారా చేసిన వైరస్ ని ఎక్కిస్తారు. ఈ విధంగా చాలా రకాలుగా వ్యాక్సిన్ని తయారు చేస్తున్నారు.


వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చింది: ఇక ఇటీవల కాలంలో వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనే మాట తరుచుగా వింటున్నాము. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక వ్యాక్సిన్ తీసుకుని ఉ ండవచ్చు. లేదా ఒక డోసు మాత్రమే తీసుకుని ఉండవచ్చు. రెండవ డోసుకు 28 రోజులు సమయం ఉండటంతో బాడీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఉండవు.


ఇక వీటితో పాటు దీనికి ప్రధానంగా ఇక్కడ రెండు లేదా మూడు కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తీసుకున్న వ్యాక్సిన్ ఎఫెక్టివ్ కాకుండా ఉండాలి. లేదా వ్యాక్సిన్ సమర్థవంతమైనదే కాని కొన్ని కారణాల వలన యాంటీ బాడీస్ కాంప్రమైజ్ అయ్యి ఉత్పత్తి అవ్వకపోయి ఉండవచ్చు. ఇక యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి కాని కొన్ని రోజులే మన బాడీలో ఉన్నాయి, అతర్వాత ఎవరి నుంచో కరోనా వచ్చి ఉండవచ్చు.


ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? ఇప్పుడు ఉయ్యూరు పట్టణ ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్న ఏ వ్యాక్సిన వేయించుకోవాలన్నదే కావటం గమనార్హం. కో వాక్సిన్ తీసుకున్నా, కోవీషీల్డ్ తీసుకున్నా అవి సమర్థవంతంగా పని చేస్తాయా లేవా అనే గ్యారంటీ అయితే లేదు. వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉండి యాంటీ బాడీస్ ఉత్పత్తయినా, అవి ఎల్లకాలం ఈ ండే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నా సరే ఏదో కారణంతో కరోనా వైరస్ దేహంలోకి ప్రవేశించవచ్చు. అప్పుడు టెస్టులు చేస్తే పాజిటివే రావచ్చు.


కానీ ఆ వైరస్ ను చంపేయగల యాంటీ బాడీస్ దేహంలో ఉత్పత్తవుతాయి కాబట్టి ఆ వైరస్ ఏమీ చేయలేదనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM