ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే

by సూర్య | Tue, Apr 06, 2021, 04:51 PM

ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. కోడ్ అమల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనల్ని పాటించలేదని టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఎస్ఈసీ నోటిఫికేషన్ పై స్టే విధించింది. కనీసం 4 వారాల ఎన్నికల కోడ్ ఉండాలన్న నిబంధన అమలు కాలేదని హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 15 కు వాయిదా వేసింది. 15 వ తేదీన మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీ ని హైకోర్టు ఆదేశించింది. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM