అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలివే

by సూర్య | Tue, Apr 06, 2021, 04:01 PM

అల్లంతో మనకు అనేక ఉపయోగాలున్నాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక కప్పు అల్లం టీ తాగితే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.


- అల్లం టీ ని రోజూ తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టొచ్చు.
- అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది.
- అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి.
- అల్లం టీ వల్ల నెలసరి సమస్యలు అదుపులోకి వస్తాయి.
- టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం
లభిస్తుంది.
- అల్లంలో అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుంది.
-వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిది.
- అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా తగ్గిపోతాయి.
- జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధ పడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM