మ‌హిళ‌ల‌ ర‌క్ష‌ణ‌కు దిశ భ‌రోసా‌‌

by సూర్య | Tue, Apr 06, 2021, 01:28 PM

రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిన దిశ మొబైల్ యాప్‌పై విశాఖ‌లో విస్తృత ప్ర‌చారం చేస్తున్నాడు. దిశ ఏసీపీ ప్రేమ్‌కాజ‌ల్ దిశ యాప్ ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకునేలా నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. వీకెండ్స్‌లో బీచ్‌రోడ్డు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో యువ‌తులు, మ‌హిళ‌లు దిశ యాప్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఐదున్న‌ర ల‌క్ష‌ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా. దిశ యాప్ వినియోగించుకుని ఫిర్యాదు చేసిన కేసులు సుమారు 50కి పైగానే ఉండ‌గా. ఇందులో 9 కేసులు న‌మోదు చేశారు. అయితే యాప్ వినియోగం ఇంకా పెర‌గాల‌ని విశాఖ దిశ పోలీసులు భావిస్తున్నారు. అందుకే నిత్యం బీచ్ రోడ్డులో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దిశ యాప్ మ‌హిళ‌ల‌కు ఎంతో ర‌క్ష‌ణ‌గా నిలుస్తోంద‌ని దిశ ఏసీపీ ప్రేమ్‌కాజ‌ల్ చెప్పారు. ప్ర‌జ‌ల్లో ఇంకా చైత‌న్యం పెర‌గాల‌ని, దిశ యాప్ వినియోగించ‌డం వ‌ల్ల క్ష‌ణాల్లో బాధితుల‌ను ర‌క్షించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. గుగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలో పోలీసులు నిత్యం మ‌హిళ‌లకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM