ఏపీలో నేటి నుంచే ఒంటి పూట బడులు

by సూర్య | Thu, Apr 01, 2021, 12:06 PM

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వేయికి చేరువలో కేసులో నమోదవుతున్నాయి. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే.. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని.. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అలాగే... విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM