తిరుమలేశుని కొండపై చేయాకూడనివి ఇవే..

by సూర్య | Wed, Mar 31, 2021, 04:42 PM

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తులసంఖ్య మెల్లగా పెరగటం మొదలైంది.దాంతో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1944లో తిరుమల కొండకు ఘాట్ రోడ్ వేసారు. ఒకప్పుడు ఈ కాలి నడక బాటలు 4 వుండేవి. కాని ఇప్పడు మాత్రం మూడే వున్నాయి. అవి తిరుపతి నుండి అలిపిరి కాలిబాట. చంద్రగిరి వైపు నుండి శ్రీవారి మెట్టు సోపానం, మామండూరు నుండి అన్నమయ్య కాలి బాట. మరి ఇటువంటి తిరుమలలో కరోనా ఆంక్షలు నెలకొన్నాయి.


కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కొత్త రూల్స్‌ని తీసుకు వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులను అనుమతించనున్నారు అధికారులు. అలాగే 1 గంట తరువాతే.. రేపటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులను ఘాట్‌ రోడ్డులో అనుమతించనున్నారు. అయితే ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు గుమికూడుతున్నారు. అటు భక్తులను అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తోంది విజిలెన్స్ సిబ్బంది. కోవిడ్ -19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులు, వారికి సేవ‌లందించే ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై టిటిడి స‌మీక్ష‌ నిర్వహించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధనలు పెట్టింది. సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించింది. అద్దె గదుల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దర్శన సమయానికి అరగంట ముందు మాత్రమే భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోకి అనుమతించనుంది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు త‌మ తిరుమల యాత్ర‌ను వాయిదా వేసుకోవాలని కచ్చితంగా తెలిపింది.

Latest News

 
చీపురుపల్లి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు Sat, Apr 20, 2024, 12:45 PM
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్‌ Sat, Apr 20, 2024, 12:44 PM
పిఠాపురం నుండి వైసీపీలోకి భారీగా వలసలు Sat, Apr 20, 2024, 12:43 PM
రాజానగరం అసెంబ్లీ స్థానానికి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:43 PM
అట్టహాసంగా రోజా నామినేషన్ Sat, Apr 20, 2024, 12:42 PM