ఏపీలో నాలుగు రోజుల పాటు వర్ష సూచన

by సూర్య | Wed, Mar 31, 2021, 01:19 PM

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌ని వార్త‌. మ‌రో నాలుగు రోజుల పాట వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు బుధ‌వారం తెలిపారు. బుధ‌వారం ఉద‌యం నుంచే ఎండ మండుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఉక్క‌బోత‌కు గుర‌వుతున్నారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కే 36 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌డంతో చిరు జ‌ల్లుల కోసం విశాఖ‌వాసులు ఎదురుచూస్తున్నారు.


వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవ నున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM