పౌరుడిగా న్యాయపోరాటం చేస్తా: నిమ్మగడ్డ

by సూర్య | Wed, Mar 31, 2021, 11:54 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ సందర్భంగా విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, హైకోర్టు వ్యాఖ్యలు, కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ఎస్‌ఈసీ గుర్తు చేసుకున్నారు.


తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని రద్దు చేసుకుని ఏపీలోని మా సొంత గ్రామంలో ఓటరుగా చేరాలని దరఖాస్తు  చేసుకున్నా. అది స్థానికంగా ఉండే ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, జిల్లా అధికారి పరిధిలో ఉండే అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. నా అప్పీలు జిల్లా కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని టీ కప్పులో తుఫానుమాదిరిగా సృష్టించారు. ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దీనికి వేరే కారణాలు ఉన్నాయని అనుకోవటం. ఇవన్నీ అపోహలకు దారితీస్తుంటాయి.


వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇలాంటివి ఎప్పుడూ కోరుకోవటం లేదు. కోరుకోను కూడా. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు. పక్కన పెట్టా. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా నా హక్కు సాధించుకోవటానికి  వెనుకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్లి  న్యాయ పోరాటం చేస్తా. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైన ఒక చోట ఓటు వేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఓటు హక్కు కల్పించనని కలెక్టరు గానీ, ఏ వ్యవస్థ అయినా అనగలుగుతుందా?. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు’’ అని నిమ్మగడ్డ అన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM