ఆ బ్యాంకు కస్టమర్లకు షాక్..

by సూర్య | Tue, Mar 30, 2021, 04:46 PM

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ కస్టమర్ల కోసం కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు జరిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లుగా పేర్కొంది. వారికి బ్యాకింగ్ సేవల్లో కలిగిన సమస్యలను పరిశ్కరించే పనిలో ఉన్నట్లుగా వెల్లడించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్/ మొబైల్ యాప్ కొన్ని సమస్యలు వచ్చినట్లుగా వారి ఐటీ సెల్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కేర్ యూనిట్ రంగంలోకి దిగింది. సమస్యను తేల్చే పనిలో పడింది. ఈ సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి ట్వీట్ చేసింది. “కొంతమంది కస్టమర్‌లు మా నెట్‌బ్యాంకింగ్ / మొబైల్‌బ్యాంకింగ్ యాప్‌ను యాక్సెస్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వాటిని పరిష్కారించేందుకు తొలి ప్రాధాన్యతతో దీనిని పరిశీలిస్తున్నాము. అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. కొంతకాలం తర్వాత మళ్లీ ప్రయత్నించమని అభ్యర్థిస్తున్నాము, ధన్యవాదాలు. ” అంటూ పోస్ట్ చేసింది బ్యాంక్.

Latest News

 
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM