మరో బంపరాఫర్ ప్రకటించిన ఎల్ఐసీ..

by సూర్య | Sat, Mar 27, 2021, 02:21 PM

ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తమ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా ఆరు నెలలకు సమానమైన హోమ్ లోన్ ఈఎంఐలను రద్దు చేస్తామని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. గృహ వరిష్ట హోమ్ లోన్ ప్రొడక్ట్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీం (డిబిపీఎస్) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు. కొత్త ఆఫర్ ప్రకారం 37, 38, 73, 74, 121, 122వ ఈఎంఐలకు మినహాయింపు ఉంటుంది. బకాయి ఉన్న ఈఎంఐలు, తరువాతి నెలల ప్రిన్సిపల్ అమౌంట్‌కు యాడ్ చేసిన మొత్తాన్ని ఆఫర్లో భాగంగా రద్దు చేస్తారు. డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్‌ ప్రకారం పెన్షన్‌కు అర్హత ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూ, బ్యాంకు, డిఫెన్స్ ఇతర ఉద్యోగులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులని ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. గృహ వరిష్టకు దరఖాస్తు చేసుకునే వారికి 65 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు. కస్టమర్లకు 80 సంవత్సరాలు వచ్చేవరకు లేదా లోన్ గడువు అత్యధికంగా 30 సంవత్సరాల వరకు.. రెండిట్లో ఏది ముందు వస్తే అంత వరకు లోన్ టెన్యూర్ ఉంటుంది.


గృహ వరిష్ట పథకాన్ని గత సంవత్సరం జులై నెలలో ప్రారంభించారు. అప్పటి నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై.విశ్వనాథ గౌడ్ తెలిపారు. మార్కెట్లో ఉన్న హోమ్ లోన్ స్కీమ్‌లకు ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేమైన ఆఫర్లతో ఎక్కువ మంది కస్టమర్లకు సేవలందించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తాజాగా ప్రకటించిన ఆరు ఈఎంఐల రద్దు ఆఫర్‌ను కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్‌గా అందిస్తామని విశ్వనాథ వివరించారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇప్పటి వరకు 15,000 హోమ్ లోన్లను అందించింది. వీటి విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుంది. సిబిల్ స్కోరు 700, అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు 6.9 శాతం ప్రారంభ వడ్డీతో రూ.15 కోట్ల వరకు హోమ్ లోన్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM