యువతి ఆత్మహత్యాయత్నం

by సూర్య | Sat, Mar 27, 2021, 01:14 PM

భర్త వేధింపులు తట్టుకోలేక న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ వద్ద శక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించిన ఒంగోలులోని గద్దలకొండకు చెందిన మోటుపల్లి రమాదేవి(24)ని వెస్టు డీఎస్పీ కె.సుప్రజ కాపాడారు. పొదిలిలోని పోస్టల్‌ విభాగంలో పని చేస్తున్న ముసలయ్యతో రమాదేవికి 2015లో వివాహం జరిగింది. అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు కాగా ఆ విషయం దాచాడు. ఈ క్రమంలో పెళ్లి అయినప్పటి నుంచి భర్త డబ్బు కోసం రమాదేవిని హింసించేవాడు. రెండున్నరేళ్ల కుమారుడిని కూడా తల్లి నుంచి దూరం చేసి ఒంగోలులోని శిశు విహార్‌లో చేర్పించాడు.


ఒంగోలులో మున్సిపాల్టిలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేసే రమాదేవి కుమారుడిని తనకు ఇప్పించాలని భర్తను కోరుతున్నా ఆయన పట్టించుకోకుండా డబ్బుల కోసం ఆమెనే వేధిస్తున్నాడు. దీంతో ఆమె గతంలో పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. ఈ నేపథ్యంలో గుంటూరు చేరుకుని అర్ధరాత్రి సమయంలో చెయ్యి కోసుకుని రైలు పట్టాలపై పడుకుంది. సమాచారం అందుకున్న వెస్టు డీఎస్పీ సుప్రజ ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి కౌన్సెలింగ్‌ ఇచ్చి కొత్తపేట పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఆమెను రైల్వే పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు అప్పగించారు

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM