ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

by సూర్య | Wed, Mar 24, 2021, 05:48 PM

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. సెకెండ్ వేవ్ మొదలైందనే అనుమానం పెరుగుతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి గ్రామ సచివాలయ్యాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రను కరోనా వైరస్ భయపెడుతోంది. ఊహించని స్థాయిలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. ప్రజలు మాత్రం సెకెండ్ వేవ్ మొదలైందని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కొందరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా అధికారులు రూపొందిస్తున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM