ఏపీలో కరోనా భయం..ప్రజల్లో టెన్షన్

by సూర్య | Wed, Mar 24, 2021, 05:09 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకానొక రోజున కేవలం 30కి పడిపోయిన కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 585 కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో 99 కేసులతో గుంటూరు జిల్లా ఉండగా... 8 కేసులతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదే సమయంలో చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,121కి పెరిగింది. ఇదే సమయంలో 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,197 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM