త‌ల‌నొప్పిని తగ్గించే అద్భుత‌మైన చిట్కాలు

by సూర్య | Wed, Mar 24, 2021, 03:41 PM

ప‌ని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మందిని త‌ల‌నొప్పి బాధిస్తుంది. వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే అంత ఎక్కువగా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే ప‌లు చిట్కాల‌ను పాటిస్తే ఎలాంటి త‌ల‌నొప్పినైనా త‌గ్గించుకోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


-> ఎండ‌లో తిరిగే సమయంలో త‌ల‌కు క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ చుట్టుకోవ‌చ్చు. వీటి వ‌ల్ల ఎండ నేరుగా మ‌న త‌ల‌కు త‌గ‌ల‌దు. దీంతో త‌ల‌నొప్పి రాకుండా ఉంటుంది.
-> ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల వ‌చ్చిన త‌ల‌నొప్పి అయితే.. కొంతసేపు నీడ‌లో ఉండాలి. చ‌ల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చ‌ల్లని నీటితో క‌డుక్కోవాలి. కళ్లను బాగా క‌డ‌గాలి. దీని వ‌ల్ల మ‌న‌స్సుకు ప్రశాంతత క‌లుగుతుంది. రిలాక్స్ అయిన భావ‌న క‌లిగి త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.
-> నీటిని త‌గినంత తాగ‌క‌పోయినా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. క‌నుక నిత్యం అవసరమైనంత నీటిని తాగితే త‌ల‌నొప్పి రాకుండా ఉంటుంది.
-> చ‌ల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ‌, ఇత‌ర స‌హ‌జ సిద్ధ పానీయాల‌ను తాగాలి. వ‌ట్టివేరుతో చల్లని పానీయం త‌యారు చేసుకుని తాగితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.
-> అర‌టి పండ్లు, పైనాపిల్‌, పుచ్చకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా త‌లనొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM