హైకోర్టు నిర్ణయం కోసం పేట వాసుల నిరీక్షణ

by సూర్య | Tue, Mar 23, 2021, 03:36 PM

చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికలు ముగియడం, అభ్యర్థుల ప్రమాణ స్వీకారం, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అన్ని సజావుగా పూర్తయ్యాయి. అయితే గణపవరం, పసుమర్రు గ్రామాల విలీనానికి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై మంగళ, బుధవారాలలో హైకోర్టు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెల కొంది. కోర్టు విలీనం చట్టబద్ధమే అని సమర్థిస్తుందా... లేక విలీనం సరికాదని చెబుతుందా... అనేది ప్రశ్నార్థకంగా మారింది.


విలీనం చట్టబద్ధమే అని న్యాయవాదులు వేసిన పిటిషన్ను కొట్టి వేస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు. కానీ విలీనం సరికాదంటూ కోర్టు చెబితే మాత్రం గణపవరం లోని ఐదు వార్డులలో, పసుమర్రులోని రెండు వార్డుల నుంచి గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం ఏమిటి? ఆ రెండు గ్రామాల మినహాయించి చిలకలూరిపేట పట్టణంలో లో కౌన్సిల్ యధావిధిగా కొనసాగుతుందా..? రిజర్వేషన్ల ప్రకారం అసలు ఎన్నిక చెల్లుబాటు అవుతుందా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పట్టణ ప్రజల మెదళ్లలో మెదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి నెలకొంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM