ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్

by సూర్య | Wed, Jan 20, 2021, 05:44 PM

ఎస్‌బీఐ తన ఖాతాదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఏటీఎం సెంటర్‌ లో లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ దగ్గర మీ ఏటీఎం కార్డ్ ఉపయోగించేప్పుడు పిన్ నెంబర్ కనిపించకుండా చేతులు అడ్డు పెట్టండి.
- మీ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం పిన్, కార్డు వివరాలు ఎవరికి చెప్పకూడదు.
- మీ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం పిన్ నెంబర్‌ ను ఎట్టిపరిస్థితుల్లో కార్డుపైన రాయకూడదు.
- మీ కార్డు వివరాలు లేదా పిన్ నెంబర్ అడుగుతూ ఎవరైనా కాల్స్, మెసేజెస్, ఇమెయిల్స్ చేస్తే అస్సలు పట్టించుకోవద్దు.
- మీ ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, అకౌంట్ నెంబర్ ‌ను ఏటీఎం కార్డు పిన్ లాగా ఉపయోగించకూడదు.
- మీరు లావాదేవీలు జరిపిన తర్వాత వచ్చిన రసీదు మీకు అవసరం లేకపోతే ముక్కలుముక్కలుగా చింపేయాలి.
- మీరు లావాదేవీలు జరిపే ముందు నిఘా కెమెరాలు ఉన్నాయేమో ఓసారి చెక్ చేయాలి.
- ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ ‌లో కీప్యాడ్‌ పైన మరో కీప్యాడ్ ఉందేమో ఓసారి చూసుకోవాలి.
- మీరు జరిపే ప్రతీ లావాదేవీపై మీకు అలర్ట్ మెసేజ్ వచ్చేలాగా బ్యాంకులో మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయించాలి.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM