సపోటాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

by సూర్య | Wed, Jan 20, 2021, 04:19 PM

సపోటాలు తినేందుకు భలే తియ్యగా ఉంటాయి కదూ...అలాగే ఇది మనకు చేకూర్చే ఆరోగ్యం కూడా స్వీట్‌గానే ఉంటుంది. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-సపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
-శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ అందిస్తుంది.
-సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మంచిది.
-సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి.
-సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.
-జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది.
-జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట.
-కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.
-సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి.
-గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుందట.
-రోజూ సపోటా జ్యూస్‌ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట.
-ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట.
-నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుందట.
-నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిదట.
-వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోట మంచిది.
అయితే, డయాబెటీస్, గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ పండును తినాలి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM