ఐఎమ్​ఎస్​ యాప్ పేరుతో జనాలకు కుచ్చు టోపీ..

by సూర్య | Tue, Jan 19, 2021, 02:07 PM

గుంటూరులో ఐమనీ సర్వీస్ పేరుతో మోసం జరిగింది. మొబైల్, డీటీహెచ్ రీఛార్జులను ఐఎమ్​ఎస్ యాప్ ద్వారా చేసుకోవచ్చని.. అందుకు 1 శాతం కమిషన్​ వస్తుందని యాప్ నిర్వాహకులు డాలరాజు వెంకట్రావు, శివ అనే ఇద్దరు వ్యక్తులు ప్రచారం చేశారు. దీంతో చాలామంది చిరువ్యాపారులు ఇందులో డీలర్ షిప్ తీసుకున్నారు. వీరి వద్ద మరికొందరు సబ్ డీలర్లుగా చేరారు. అందుకోసం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించారు. యాప్ మొదలుపెట్టిన నాలుగు నెలల తర్వాత యాప్‌ను శివ నిలిపివేశాడు. నష్టపోయామని తెలుసుకున్న బాధిత యువకులు అర్బన్ ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. అలాగే గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM