ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త..!

by సూర్య | Mon, Jan 18, 2021, 04:05 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్ వ్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. తాజా నియామకాల ద్వారా మొత్తం 50 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆపరేషన్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. 27 ఏళ్లలోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేలు ఉపకార వేతనంగా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను విజయనగరంలోని ఐటీఐ కాలేజీలో నిర్వహించనున్నారు. ITI(Fitter) విద్యార్హత కలిగిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో సూచించారు. అనుభవం కలిగిన వారు, ఫ్రెషర్స్ ఎవరైనా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని స్పష్టం చేశారు. కేవలం పురుషులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 9182412990 నంబరును సంప్రదించవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులుhttps://www.apssdc.in/home/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19 ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM