ఫాస్టర్ ప్రవీణ్ తో జగన్ బావకు సంబంధాలు ఉన్నాయి: చినరాజప్ప

by సూర్య | Sun, Jan 17, 2021, 04:27 PM

ప్రవీణ్ చక్రవర్తితో జగన్ బావ అనిల్‌కు సంబంధాలున్నాయని మాజీమంత్రి, టీడీపీ నేత చిన్నరాజప్ప ఆరోపించారు. ఇవన్నీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రజలు చెప్పినా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదన్నారు. డీజీపీ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. దాడుల వెనక సంఘ విద్రోహ శక్తులని ఒక రోజు.. మరొక రోజు టీడీపీ, బీజేపీకి సంబంధం ఉందని చెపుతున్నారన్నారు. ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేయకుండా ఏడాది కాలంగా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేశారా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సీఐడీ విచారణ జరుగుతోందా లేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన వీడియో సందేశంపై పూర్తి విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చిన్నరాజప్ప పేర్కొన్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM