రూ.20 వేలలోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్లు ఇవే

by సూర్య | Sat, Jan 16, 2021, 03:45 PM

1. షావోమీ ఎంఐ 10ఐ: షావోమీ ఎంఐ 10ఐ జనవరి మొదటివారంలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. దీంతో పాటు స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,820ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,000 బడ్జెట్‌లో కొనొచ్చు. 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు ఇష్టపడేవారి కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
2. మోటో జీ 5జీ: కొద్ది రోజుల క్రితం మోటోరోలా నుంచి మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 నిమిషాలు రీఛార్జ్ చేస్తే 10 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొచ్చు. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రోస్టెడ్ సిల్వర్, వోల్కానిక్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ధర రూ.19,999.
3. రియల్‌మీ 7 ప్రో: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ అమొలెడ్‌ డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో Sony IMX682 సెన్సార్‌తో 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 34 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. రియల్‌మీ 7 ప్రో ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999.
4. పోకో ఎక్స్3: పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండటం విశేషం. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పోకో ఎక్స్3 బ్యాటరీ 6000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. పోకో ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ ధర ధర రూ.17,999.
5. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64+12+5+5 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32మెగాపిక్సెల్. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10+సాంసంగ్ వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ మిరేజ్ బ్లూ, మిరేజ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,499.
6. ఒప్పో ఎఫ్17: ఒప్పో ఎఫ్17 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 16+8+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. ఇందులో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఎఫ్17 ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నేవీ బ్లూ, డైనమిక్ ఆరెంజ్, క్లాసిక్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,990.
7. మోటోరోలా వన్ ఫ్యూజన్+: వన్ ఫ్యూజన్+ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, పాప్ అప్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64+8+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. మోటోరోలా వన్ ఫ్యూజన్+ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 15 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూన్ లైట్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,499.
8. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్: రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 64 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ బ్యాటరీ 5020 ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ ధర రూ.16,999 కాగా 6జీబీ+128జీబీ ధర రూ.18,499.
9. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్+5 మెగాపిక్సెల్ టెర్టియర్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 బ్యాటరీ 6,000ఎంఏహెచ్. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ప్యూజన్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,499. ఇక 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM