పోలీసుల తీరును ఖండిస్తున్నా: విష్ణువర్ధన్

by సూర్య | Sat, Jan 16, 2021, 12:33 PM

రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లో బీజేపీకు చెందిన నలుగురు కార్యకర్తల హస్తం ఉందని గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలు వున్నారని పోలీసులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ 48 గంటల ముందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి దేవాలయాల ధ్వంసం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు పై దాడి అన్యమతస్తులనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, దీనిని దృష్టి మళ్లించేందుకు పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల పై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. ఇలాంటి పోలీసు రాష్ట్రంలో దుండగుల చర్యలతో దేవాలయాలను రక్షిస్తారనే నమ్మకం పోతోందని చెప్పారు. పోలీసులు వైసీపీ కోసం పనిచేస్తున్నారా, లేక ప్రజల కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చేతకాని వైఖరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. దేవాలయాల దాడుల కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM