ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ కాల్స్ చేసేవారికి కొత్త రూల్స్..

by సూర్య | Fri, Jan 15, 2021, 04:25 PM

మీరు ల్యాండ్‌లైన్ నుంచి ఎక్కువగా కాల్స్ చేస్తుంటారా? అయితే ఈ విషయం తెలుసుకోవాలి. ఇకపై ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు కాల్ చేస్తే ముందు 0 అంకెను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అంటే 9999999999 నెంబర్‌కు ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేయాలంటే 09999999999 నెంబర్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే 10 అంకెలు డయల్ చేస్తే సరిపోయేది. కానీ ఇకపై 11 అంకెలతో కాల్ డయల్ చేయాలి. కొత్త రూల్‌ను 2020 నవంబర్‌లోనే ప్రకటించింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్-DoT. ఈ రూల్ 2021 జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. కానీ 15 రోజుల తర్వాత అంటే ఈరోజు నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది.
ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ నెంబర్‌కు ముందు 0 లేకుండా డయల్ చేస్తే కాల్స్ వెళ్లవు. ఈమేరకు అన్ని టెలికాం కంపెనీలు మార్పులు చేశాయి. ఈ కొత్త రూల్ గురించి తమ కస్టమర్లకు వివరిస్తున్నాయి. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేప్పుడు ముందు 0 తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి అని రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థలు తమ కస్టమర్లను కోరుతున్నాయి. కస్టమర్లు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేస్తేనే ఈ రూల్ వర్తిస్తుంది. అంటే ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM