ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ.. 17 నుంచి ఉత్తర్వులు

by సూర్య | Fri, Jan 15, 2021, 11:33 AM

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అధికారులు ఈనెల 17 వరకు ఆన్‌ లైన్‌ లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. బుధవారం 1,400 మంది ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్‌ నుంచి జారీ చేశారు. అయితే రాష్ట్రంలో మొత్తం 76 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి.
వెబ్ ‌కౌన్సిలింగ్‌ ద్వారా ఈ బదిలీలను నిర్వహిస్తున్నారు. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పని చేస్తున్న ఉపాధ్యాయులను, ఐదేళ్లుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేయడానికి రెండేళ్ల కనిష్ట సర్వీసు పెట్టారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, వితంతు ఉపాధ్యాయినులు, ఇలా కొన్ని కేటగిరీల టీచర్లకు ప్రాధాన్యతనిచ్చారు.

Latest News

 
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM
పాఠశాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే! Fri, Apr 19, 2024, 03:03 PM
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM
21న టీడీపీ అభ్యర్థులకు చివరిగా బీ ఫారాలు Fri, Apr 19, 2024, 02:55 PM