భోగి వేడుకల్లో చంద్రబాబు

by సూర్య | Wed, Jan 13, 2021, 09:20 AM

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పరిటాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన భోగీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. విజయవాడకు చెందిన పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు పార్టీ నాయకులు, తెలుగు మహిళ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగీ మంటల్లో పడేసి, దగ్ధం చేశారు. ఆ జీవోల పట్ల నిరసన వ్యక్తం చేశారు


మున్సిపల్ చట్టాల్లో సవరణను తీసుకుని రావడానికి ఉద్దేశించిన 196, 197,198 జీవోలు అవి. వాటిని రద్దు చేయాంటూ కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోల వల్ల మున్సిపాలిటీల పరిధిలో నివసించే వారిపై పెనుభారం పడుతుందనేది టీడీపీ నేతల వాదన. పాత విధానం ప్రకారం.. అద్దె విలువ ఆధారంగా పన్ను వేసేవారని.. తాజాగా తీసుకొచ్చిన జీవోల వల్ల ఆస్తి విలువతో పాటు ఇంటి నిర్మాణానికైన ఖర్చును కలిపి పన్ను వేయడం వల్ల ప్రజలపై పెను భారం పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 


ప్రతి సంవత్సరం భూముల విలువతో పాటు పన్ను విలువ కూడా పెరుగుతూ ఉంటుందని, మంచినీటి పన్ను మొత్తాన్ని 350 రూపాయల వరకూ వసూలు చేయడం, మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు సామాన్యులపై పెను భారంగా పరిణమిస్తాయని విమర్శిస్తున్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలియజేశారు. తాజాగా- అవే జీవోలను భోగి మంటల్లో వేసి.. నిరసన తెలిపారు.


 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల ఈ సారి సంక్రాంతి పండుగ చిన్నబోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత సంక్రాంతికి ప్రజారాజధాని అమరావతిని కాదని, పాలకులు మూడు రాజధానుల మాట అందుకున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఆందోళనతో పండుగ చేసుకోలేక పోయారని విమర్శించారు. వరుస వరదలు, తుఫానులు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని, వారిని సకాలంలో ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని, ఫలితంగా ఈ సంక్రాంతి కూడా చిన్నపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


 


వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వచ్చిన రెండు సంక్రాంతి పండుగలు రైతాంగ విధ్వంసానికి అద్దం పట్టాయని విమర్శించారు. పాలకులకు ప్రజలు బాగుండాలనే బలమైన ఆకాంక్ష, చిత్తశుద్ధి లేనందువల్లే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యం ప్రభుత్వానికి లేదని, అందుకే రైతుల పండుగగా భావించే సంక్రాంతి కాంతులు మసకబారాయని అన్నారు. ఈ ఏడాది రైతులకు కలిసి రావాలని, భోగభాగ్యాలతో రైతు లోగిళ్ళు కళకళలాడాలని కోరుకుంటున్నానని చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు


 


వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వచ్చిన రెండు సంక్రాంతి పండుగలు రైతాంగ విధ్వంసానికి అద్దం పట్టాయని విమర్శించారు. పాలకులకు ప్రజలు బాగుండాలనే బలమైన ఆకాంక్ష, చిత్తశుద్ధి లేనందువల్లే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యం ప్రభుత్వానికి లేదని, అందుకే రైతుల పండుగగా భావించే సంక్రాంతి కాంతులు మసకబారాయని అన్నారు. ఈ ఏడాది రైతులకు కలిసి రావాలని, భోగభాగ్యాలతో రైతు లోగిళ్ళు కళకళలాడాలని కోరుకుంటున్నానని చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM