టీటీడీ మరో కీలక నిర్ణయం.

by సూర్య | Tue, Jan 12, 2021, 09:51 AM

టీటీడీ పాలక మండలి ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే... భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దాంతో మరింత సౌకర్య వంతంగా దర్శన భాగ్యం కల్పించడంతోపాటూ... ఇంకా ఏయే మంచి కార్యక్రమాలు చేయాలో అవి చేస్తూ ఉంటుంది. తాజాగా జనవరి 15న శ్రీవారికి తిరిగి సుప్రభాత సేవను ప్రారంభించబోతోంది. అందువల్ల ఉదయాన్నే స్వామివారితోపాటూ... భక్తులకు కూడా సుప్రభాతం వినిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా... ఇంకా వినాలనిపించే ప్రత్యేకత సుప్రభాతానిది. అందువల్ల ఈ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారిని నిద్రలేపుతూనే... సుప్రభాతం వినిపిస్తారు. దాంతో స్వామి వారు లేవడంతోనే... ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ... భక్తులకు వరాలు ఇస్తారు.


ధనుర్మాసం సందర్భంగా 2020 డిసెంబర్ 16 నుంచి సుప్రభావత సేవ ఆగిపోయింది. ధనుర్మాసం జనవరి 14తో ముగుస్తుంది. అందువల్ల తిరిగి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు మొదలవుతాయి. 14న ధనుర్మాస ఘడియలు ముగియనుండటంతో 15 తెల్లవారుజామునుంచి సుప్రభాతంతో స్వామి వారిని నిద్రలేపుతారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం వస్తున్న సమయంలో భక్తులను కూడా అనుమతిస్తారు. జనవరి 16న శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం, గోదాపరిణయోత్సవాలను టీటీడీ జరపబోతోంది. సంక్రాంతి తర్వాత కనుమ రోజున ఇది జరపడం సంప్రదాయం.ఈమధ్యే టీటీడీ భక్తులకు 10 రోజులపాటూ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. జనరల్‌గా వైకుంఠ ద్వార దర్శనం 2 రోజులు మాత్రమే కల్పించేవారు. ఇప్పుడు మాత్రం 10 రోజులు ఛాన్స్ ఇవ్వడంతో... లక్షల మంది భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా రానున్నాయి. కొత్త జంటలు స్వామి వారి ఆశీర్వాదం పొందనున్నాయి. అందువల్ల తిరుమలలో మళ్లీ సందడి మరింత పెరగనుంది.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM