SBI కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త

by సూర్య | Mon, Jan 11, 2021, 01:55 PM

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ FD రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది.


స్టేట్ బ్యాంక్ రూ.2 కోట్లకు లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. జనవరి 8 నుంచే రేట్ల సవరణ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది.ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త ఎఫ్‌డీ రేట్లను వర్తిస్తుంది. అలాగే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. కాగా స్టేట్ బ్యాంక్ 2020 సెప్టెంబర్ 10న ఫిక్స్‌డ్ డిపాజిట్లను సవరించిన విషయం తెలిసిందే. రేట్లు పెంపు నిర్ణయం తర్వాత బ్యాంక్‌లో ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది.


రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.1 శాతం వడ్డీ పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ వస్తుంది. 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పొందొచ్చు.

Latest News

 
ప్రతి ఇంటికీ 4 సార్లు వెళ్లాలి Fri, Apr 19, 2024, 02:31 PM
అభ్యర్థుల మార్పు, కూటమిలో గందరగోళం Fri, Apr 19, 2024, 02:31 PM
ఎంఎస్‌ రాజుకు దక్కనున్న మడకశిర అసెంబ్లీ స్తానం Fri, Apr 19, 2024, 02:30 PM
ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు Fri, Apr 19, 2024, 02:29 PM
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకి తావులేకుండా చర్యలు Fri, Apr 19, 2024, 02:29 PM