ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

by సూర్య | Sat, Jan 09, 2021, 04:07 PM

 ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రకటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎన్‌ఈసీ) ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఎస్‌ఈసీ జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను నిలువరించాలని అభ్యర్ధించింది. 


కరోనా వ్యాక్సినేషన్ సన్నద్ధతలో ప్రభుత్వశాఖల సిబ్బంది ఉండటం, కొత్తరకం స్ట్రెయిన్‌ భయం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది. ఫిబ్రవరి 5 నుంచి 17వరకు నాలుగో దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ శుక్రవారం ప్రొసీడింగ్స్‌ విడుదల చేసి విషయం తెలిసిందే.  

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM