బాల్య వివాహాల నిషేధ చట్టాలివే..

by సూర్య | Sat, Jan 09, 2021, 04:00 PM

చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే జైలు శిక్ష
బాలలకు వివాహాలు చేసి వారి జీవితాలు నాశనం అవ్వకుండా ఉండేందుకు బాల్య వివాహాల నిరోధక చట్టం 1929లో ఏర్పడింది. ఈ చట్టం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మినహా మొత్తం భారతదేశానికి విస్తరించి ఉంది. భారత పౌరులందరికీ వర్తిస్తుంది. ఈ చట్టం ఏప్రిల్ 1, 1930 నుండి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు తెలియజేస్తున్నాం.
చిన్న వయస్సులో పెళ్లి చేస్తే బాల్య వివాహం
పెళ్లీడు రాని పిల్లలకు పెళ్లి చేస్తే నేరం
ఈ చట్టం సెక్షన్‌ 2 ప్రకారం ఎవరైనా బాలలతో జరిపే వివాహాన్ని బాల్య వివాహం అంటారు. వివాహాంలో వధువు, వరుడులలో ఎవరైనా ఒకరు బాలలగా ఉంటే ఆ వివాహాన్ని బాల్య వివాహం అంటారు. 21 సంవత్సరాలు నిండని పురుషుడు, 18 సంవత్సరాలు నిండని బాలికకు పెళ్లి చేస్తే అది నేరం కింద పరిగణింపబడుతుంది.
బాలలకు పెళ్లి చేస్తే శిక్షార్హులు
15 రోజులు జైలు శిక్ష, రూ.1000 జరిమానా
ఈ చట్టం ప్రకారం బాలలకు వివాహం జరపకూడదు. అలా జరిపినట్లయితే శిక్షార్హులవుతారు. ఈ చట్టం సెక్షన్‌ 3 ప్రకారం 18 సంవత్సరాలు పైన, 21 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న ఏ పురుషుడు బాలికను వివాహం చేసుకుంటే 15 రోజుల జైలుశిక్ష లేదా 1000 జరిమానా విధించవచ్చు.
21ఏళ్లు దాటిన పురుషుడు బాలికతో పెళ్లి కుదుర్చుకుంటే నేరం
మూడు నెలల జైలు శిక్ష, జరిమానా
ఈ చట్టం సెక్షన్‌ 4 ప్రకారం 21 సంవత్సరాలు దాటిన పురుషుడు బాలికను వివాహం కుదుర్చుకుంటే మూడు నెలలు జైలు శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించబడుతుంది. సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా బాల్యవివాహాన్ని నిర్వహించినా, కుదిర్చినా వారికి జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్ష మూడు నెలల వరకూ ఉంటుంది. జరిమానా కూడా విధించబడుతుంది.
బాల్య వివాహం కుదిరిస్తే 3 నెలల జైలు శిక్ష
మౌనంగా ఉన్న తల్లీదండ్రులు, సంరక్షకులు నేరస్థులే..
సెక్షన్ 6 ప్రకారం బాల్య వివాహం ప్రోత్సాహించినా, అలాంటి పెళ్లికి అంగీకరించినా... కుదుర్చుకున్న లేదా జరుగుతున్నదని నిర్లక్ష్యం వహించినా 3 నెలలు వరకు జైలు శిక్ష విధించబడుతుంది. జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో మహిళలకైతే జైలు శిక్ష ఉండదు. అలాగే ఈ సెక్షన్‌ ప్రకారం బాల్య వివాహం జరిగితే ఆ బాలలకు సంబంధించిన తల్లిదండ్రులు లేదా సంరక్షడుగానీ నిర్లక్ష్యం వహించినట్టు భావించబడుతోంది. అంటే ఒక బాల్య వివాహం జరుగుతున్నప్పుడు దానిని ఆపాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ఈ క్లాజ్‌ను పెట్టడం జరిగింది.
భారత దేశంలో బాల్య వివాహాలకు అడ్డుకట్టే వేసి.. వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉండడానికే ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ చట్టం ఉన్నప్పటికీ చాలాచోట్ల బాల్య వివాహాల తంతు సాగుతూనే ఉంది.

Latest News

 
నారా లోకేశ్ కాన్వాయ్‌లో రూ.8 కోట్ల క్యాష్ దొరికిందా..? వైరల్ అవుతోన్న వీడియోలో నిజమెంత. Fri, Mar 29, 2024, 07:48 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు Fri, Mar 29, 2024, 07:44 PM
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దని హెచ్చరిక Fri, Mar 29, 2024, 07:39 PM
నాలుగో లిస్ట్ ఎఫెక్ట్.. చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ Fri, Mar 29, 2024, 07:34 PM
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM