ఇంద్రీకలాద్రిపై ముగిసిన భవాని దీక్షల విరమణ

by సూర్య | Sat, Jan 09, 2021, 11:32 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భవాని దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. శనివారం ఉదయం పూర్ణాహుతితో ఈ భవాని దీక్ష విరమణ ముగింపు పలికారు. ఐదురోజుల పాటు వైభవంగా భవానీ దీక్ష విరమణలు సాగాయి. ఈ సందర్భంగా ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ... భవాని భక్తుల కోసం రేపు కూడా దీక్ష విరమణకి ఏర్పాట్లు యధాతధంగా ఉంటాయని తెలిపారు. లక్షా 10 వేల మంది ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నారని... ఈ రోజు, రేపు మరో 40 వేలు మంది దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం లోపే దుర్గ గుడి అభివృద్ధి చేస్తామని ఈవో సురేష్ బాబు వెల్లడించారు.


దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ... మొన్నటి దాకా గుడుల నుండి డబ్బు ప్రభుత్వం తీసుకోవటం చూశామని... గుడికి ప్రభుత్వం డబ్బు ఇవ్వటం ఇప్పుడే చూశామని అన్నారు. సంవత్సరంలోపే దుర్గ గుడిలో నిర్మాణాలు పూర్తి చేసి సీఎం గారితో ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM