విశాఖలో రూ.98కోట్ల భూమి స్వాధీనం

by సూర్య | Sat, Jan 09, 2021, 11:27 AM

విశాఖ: విశాఖలో ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విశాఖ కొమ్మాది గ్రామంలో రూ.98 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని గ్రామీణ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొమ్మాది గ్రామంలోని సర్వే నెంబరు66/2లో 11.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు గ్రామీణ తహసీల్దార్‌ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.98 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.


 


 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM