దేవాలయాల దాడులపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు..

by సూర్య | Fri, Jan 08, 2021, 03:56 PM

గవర్నర్‌ బిశ్వభూషణ్​ను టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కలిశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేతలు నిలదీశారు. దాడుల్ని మరింత ప్రోత్సహించేలా సీఎం, పోలీసులు వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మతసామరస్యం దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. వరుస సంఘటనలు జరుగుతుంటే ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలా చోద్యం చూడదని తెదేపా నేతలు తేల్చిచెప్పారు. జగన్ తమ ఆత్మ అని చెప్పే కొందరు మఠాధిపతులు, స్వామీజీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కాకుండా వీరు కూడా రాజకీయాల కోసమే ఉన్నారా? అని నిలదీశారు. ఆలయాలపై ఘటనలకు బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వరుస దాడుల ఘటనలను పక్కదారి పట్టించే జగన్నాటకానికి జగన్ తెరలేపారని ధ్వజమెత్తారు

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM