మతసామరస్యాన్ని కాపాడేందుకు "పీస్ కమిటీలు"..

by సూర్య | Fri, Jan 08, 2021, 03:31 PM

ఏపీలో మతసామరస్యం కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవాదాయ, మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని చెప్పారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారన్నారు.
ఈ కమిటీలు రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయని సీఎస్‌ చెప్పారు. కమిటీలకు ప్రస్తుతానికి ఎలాంటి కాలపరిమితి లేదని, ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, మత సామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాసేవలో ఉన్నవారికి మతం ఆపాదించడం సరికాదన్నారు. వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందని, నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ తనవంతు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మత సామరస్యం కాపాడేందుకు అందరూ ముందుకురావాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారు.

Latest News

 
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM