ఏపీలో ఉద్యోగాలు.. వివరాలివే

by సూర్య | Thu, Jan 07, 2021, 05:07 PM

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఐడీఏ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.12082 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు జనవరి 7ను చివరితేదీగా ప్రకటించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతల వివరాలు: గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, లేదా డిప్లొమో
అభ్యర్థులు 2017-20 మధ్యలో పాసైన వారై ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేయవచ్చు. వయస్సు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ల ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు వైజాగ్ లోని కంపెనీ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు, సందేహాల నివృత్తికి 9959377669 నంబరును సంప్రదించవచ్చు. https://apssdc.in/industryplacements/ ఈ లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM