మతం ముసుగులో ప్రతిపక్షాల కుట్ర: అంబటి రాంబాబు

by సూర్య | Thu, Jan 07, 2021, 04:11 PM

రాజకీయ లబ్ధి కోసం మతం ముసుగులో ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన జరుగుతోందన్న ఆయన మత రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఒప్పుకోరని అన్నారు. భాజపా నేత బండి సంజయ్‌ సామర్థ్యం ఏంటో తనకు తెలియదన్న అంబటి. ఆయన కార్పోరేటర్‌ స్థాయి నాయకుడని వ్యాఖ్యానించారు. భాజపా మాదిరిగా మతంతో పని ఉన్న రాజకీయ పార్టీ తమది కాదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కులమతాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే పార్టీలకు రాష్ట్రంలో తావు లేదని హెచ్చరించారు. సీఎం జగన్ మీద క్రిస్టియన్ అనే ముద్రవేసే క్రమంలో హిందుత్వాన్ని రక్షించే గొప్ప వ్యక్తిగా చంద్రబాబు తనను తాను చిత్రీకరించుకుంటున్నారని అన్నారు. ఆయనకు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే, అమరావతి డిజైన్​లలో అమరలింగేశ్వరస్వామి బొమ్మ బదులు, బుద్ధుడి బొమ్మను ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM