రిమాండ్ రిపోర్ట్‌ లో ట్విస్ట్.. ఏ1 గా అఖిలప్రియ..

by సూర్య | Thu, Jan 07, 2021, 03:29 PM

బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో ఆమెను ఏ1గా పేర్కొన్నారు. ఏ2గా ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ3 గా భార్గవ్ ‌రామ్ ‌పేర్లను నమోదు చేశారు. శ్రీనివాస రావు, సాయి, చంటి, ప్రకాశ్‌ ను నిందితులుగా చేర్చారు. వీరిపై ఐపీసీ 147, 120 బి, 452, 419, 341, 342, 506, 365, 324, 385 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కళ్లకు గంతలు కట్టి తమను తీసుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. 2016 లో హఫీజ్‌ పేట సర్వే నం.80లో బాధితులు 25 ఎకరాల భూమి కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ భూములు తమవేనని అఖిల ప్రియ, భార్గవ్ రామ్, సుబ్బా రెడ్డి వాదిస్తున్నారు. ప్రవీణ్ రావు.. సుబ్బారెడ్డికి డబ్బులిచ్చి మేటర్ సెటిల్ చేసుకున్నారని, అయితే భూమి ధర పెరగడంతో.. నిందితులు సమస్యలు సృష్టించారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM