భగ్గుమంటున్న వంట నూనె ధరలు

by సూర్య | Thu, Jan 07, 2021, 01:02 PM

వంటనూనె ధర సలసల కాగిపోతున్నాయి. వారం, పది రోజుల్లోనే ధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని రకాల వంట నూనెలపై 30 పెరగ్గా, మరికొన్ని నూనెలపై 15 నుంచి 20 ధర పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో ప్యాకెట్‌ ధర రూ.98 నుంచి రూ.100 దాకా ఉండగా ప్రస్తుతం రూ. 131కు చేరుకుంది. ఇదే ఆయిల్‌ కిరాణ దుకాణాల్లో రూ.136 నుంచి రూ.138 వరకు విక్రయిస్తున్నారు. సూపర్‌మార్కెట్లు, మాల్స్‌లలో రూ.140 నుంచి రూ.145 వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సెల్‌ మార్కెట్‌లో గోల్డ్‌డ్రాప్‌ ఆయిల్‌ కిలో రూ. 132కు చేరుకుంది. లాక్‌డౌన్‌ కంటే ముందు దీని ధర రూ.100 దాకా ఉండేది. పామాయిల్‌ ధర రూ. 84 నుంచి రూ.90 ఉండ గా, ప్రస్తుతం అది రూ.104కు చేరింది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM