అఖిలప్రియకు బెయిల్ వస్తుందా?

by సూర్య | Thu, Jan 07, 2021, 12:29 PM

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. బుధవారం అఖిల ప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఐతే భూమా అఖిల ప్రియ గర్భవతిగా ఉన్నారు. నిన్న నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. ఈ నేపథ్యలో కోర్టు మరి బెయిల్ ఇస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశమయింది. మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరీరీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా ఉన్నారు. ఇక భూమా అఖిలప్రియ ఏ2, భార్గవ్‌రామ్‌ ఏ3గా ఉన్నారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM